కబాలి రివ్యూ …
ఎప్పుడెప్పుగా అని ఎదురు చూసే రజని కబాలి ప్రేక్షకులముందుకు వచ్ఛేసింది కానీ..
క‘బలి’ ఏ ఛానల్ చూసినా.. ఏ ఇద్దరు కలసినా.. కబాలికి సంబంధించి ఏదో ఒక టాపిక్ మాట్లాడుతూనే ఉన్నారు.. అభిమానులైతే ఆ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూశారు… మంతి అంత హైప్ క్రియేట్ అయిన మూవీ ఏలా ఉందని ప్రశ్నిస్తే.. ఒక్క మాటలో సమాధానం చెప్పాలంటే.. బ్రహ్మోత్సవం అంత దారుణం కాదుకాని.. ఏదో అలా… అంటూ తేల్చేస్తున్నారు సినిమా చూసినోళ్లు.. అందుకని పెద్ద రివ్యూ రాయకుండా సింపుల్ గా ప్లస్.. మైనస్ పాయింట్లు గురించి చెబుతా…
ప్లస్ పాయింట్లు…
• సినిమా ఆ సాంతం రజినీ స్టైలిష్ గా కనిపిస్తారు
• రెండు పాటలు బాగా వచ్చాయి..
• రజినీ కూతురు క్యారెక్టర్ బావుటుంది
• క్లైమాక్స్ సీన్ బావుంటుంది
మైనస్ పాయింట్లు
• చెత్త కథ
• దారుణమైన కథనం…
• దేశ నాయకులు పోయినట్లు విషాదంగా సాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్
• బూతద్దం వేసి వెతికినా దొరకని పంచ్ డైలాగ్
దర్శకుడి పైత్యానికి పరాకాష్ట ఉదాహరణలు…
• 25 ఏళ్ల తరవాత భార్యాభర్తలు కలుస్తుంటే చూసేవాళ్లకు ఆ ఎమోషన్ చేరక నవ్వుతుంటారు.. దీన్నిబట్టి కథనం ఎంత గొప్పగా సాగిందో అర్థం చేసుకోవచ్చు..
• రజినీ గ్యాంగ్ స్టర్ అని చెప్పడానికి ఒక్క అంశం కూడా కనబడదు.. ఫ్లాషబ్యాక్ లోనూ.. ప్రస్తుతంలోనూ ఎక్కడా హీరో గొప్పతం కనిపించే ఒక్క సీన్ కూడా లేకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు
• మొత్తం సినిమా చూశాక… దీనికి భార్య భర్తల అనుబంధం అని టైటిల్ పెడితే బావుంటుందేమో అనిపించింది.. మళ్లీ వెంటనే రిలైజ్ అయి దర్శకుడు ఆ అవకాశం కూడా ఇవ్వలేదని గుర్తించా..
కేవలం రజనీ మీద గౌరవంతో ఇంత కన్నా మైనస్ లు రాయబుద్ధికాలేదు.. లేదంటే ఓ పది ఎడిషన్లు కావాల్సి వచ్చేవి…