Published On: Tue, Mar 5th, 2013

కంగారోలను కంగారుపెట్టిన భారత్ ..

Share This
Tags

మిస్టర్‌ కూల్‌ మహేంద్రసింగ్ ధోనీ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఉప్పల్‌ టెస్ట్‌లో విజయంతో భారత జట్టు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గంగూలీ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ 22 విజయాలతో దాదాను వెనక్కి నెట్టి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు .

గంగూలీ 49 టెస్టుల్లో సారథ్యం వహించగా 21 మ్యాచ్ల్లో టీమిండియా గెలిచి, 13 మ్యాచ్ల్లో ఓడింది . మరో 15 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ధోనీ 45 మ్యాచ్ల్లో కెప్టెన్‌గా ఉండగా 22 మ్యాచ్ల్లో గెలిచి, 12 మ్యాచ్ల్లో ఓడింది. మరో 19 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

అయితే గంగూలీ కేవలం 42 శాతం మ్యాచుల్లోనే గెలవగా ధోనీ 47 శాతం మ్యాచ్ల్లో జట్టుకు విజయాలు సాధించిపెట్టడం విశేషం. అయితే జట్టు ఎప్పుడు విజయం సాధించినా ఆ ఘనతను జట్టు సభ్యులతో పంచుకొనే ధోనీ ఈ రికార్డునూ వాళ్లకే అంకితమిచ్చాడు. ఈ రికార్డు తనొక్కడిదే కాదని జట్టు సమష్టి కృషి అని మీడియాకు తెలిపాడు.

About the Author