ఏప్రిల్ 25 నుంచి ఎంసెట్ హాల్‌టిక్కెట్లు
ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారంతో ముగియనుంది. ఇప్పటివరకు ఇంజనీరింగ్‌లో 2.46 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు. మెడికల్‌లో 89 వేల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఏప్రిల్ 25 నుంచి హాల్‌టిక్కెట్ల పంపిణీ చేస్తామన్నారు. గత ఏడాదితో పోలిస్తే మెడికల్ దరఖాస్తులు పెరిగనున్నాయని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తామన్నారు.