Published On: Tue, Jun 24th, 2014

‘ఊహలు గుసగుసలాడే’ మూవీ రివ్యూ….

Share This
Tags

సమ్మర్ చివరి రోజులు.. చిన్న సినిమాలతోనే గడిచిపోతుంది. ‘మనం’ మూవీ తర్వాత ఇప్పటి వరకు ఒక్క స్టార్ హీరో సినిమా కూడా రాలేదు. అంతేకాకుండా ఆగస్టు వరకు పెద్ద సినిమాలు విడుదలయ్యే పరిస్థితిలో లేవు. దీంతో దొరికిన ఈ గ్యాప్ లో చిన్నసినిమాలు పంజా విసురుతున్నాయి. ప్రతీ శుక్రవారం ఐదుకు పైగా చిత్రాలు విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ శుక్రవారం ఐదు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ‘ఊహలు గుసగుసలాడే’ అనే చిత్రం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. నటుడు, కామెడీ ఆర్టిస్టు అయిన అవసరాల శ్రీనివాస్.. డైరెక్టర్ గా మారి రూపొందించాడు. ఈచిత్రంపై ఆడియెన్స్ లో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. మరి ‘ఊహలు గుసగుసలాడే’ .. ప్రేక్షకులకు ఎలాంటి గుసగుసలు చెప్పింది. ఈ రోజు విడుదలైన చిత్రాల్లో ‘దమ్మున్న’ సినిమా అనిపించుకుందా..? అనేది చూద్దాం..
కథ విషయానికి వస్తే…
న్యూస్ రీడర్ కావాలనుకునే కుర్రాడు వెంకి (శౌర్య). వేసవి సెలవులకు వైజాగ్ వెళ్తాడు. అక్కడ ఢిల్లీ నుంచి వచ్చిన అమ్మాయి శిరీష ప్రభావతి (రాశి) పరిచమవుతుంది. ఇద్దరు మంచి స్నేహితులవుతారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టముంటుంది.. ప్రేమిస్తున్నానంటూ శౌర్య చేసిన ప్రపోజల్ ను రాశి కాదంటుంది. కాస్త టైం కావాలని చెబుతుంది. కొంతకాలం తరువాత శిరీష ఉదయ భాస్కర్ (అవసరాల శ్రీనివాస్) ని కలుస్తుంది. యూబీ టివికి హెడ్ అయిన ఉదయ భాస్కర్, శిరీష ను ఆకర్షించడానికి వెంకి సహాయం కోరతాడు, కాని ఉదయ్ ప్రేమిస్తున్నది శిరీష ను,, అని వెంకి కి తెలిసాక కథ మలుపు తిరుగుతుంది. తరువాత ఉదయ్ కి వెంకి సహాయపడ్డాడా..? శిరీష ఎవరిని ప్రేమించింది..? అనేది మిగిలిన కథ.
విశేషణ : సినిమా కథకు కొంత నాటకీయత అవసరం. ఇది లేకపోతే.. రియల్ లైఫ్ కు రీల్ లైఫ్ కు తేడా ఉండదు. ‘ఊహలు గుసగుసలాడే చిత్రం కూడా ఇలాగే ఉంటుంది. మాస్, మసాలా లేని మూవీగా మారిపోయింది. అయితే ప్రస్తుతం చిన్న సినిమాల్లో ఎక్కువగా కామెడీ పేరుతో కాస్త మసాలాను కలుపుతూ అడల్ట్ కామెడీని జోడిస్తున్నారు కొందరు చిన్న చిత్రాల దర్శకులు. అయితే ఇలాంటి వాటన్నీటికి ఈ సినిమా అతీతం కావడం ఆనందించాల్సిన విషయం. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు…చాలా క్లీన్ గా తీశాడు దర్శకుడు అవసరాల శ్రీనివాస్. ఎక్కడా వల్గారిటీ లేకుండా క్లాస్ గా కలర్ ఫుల్ గా సినిమా తెరకెక్కించాడు.
అయితే ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ కలుస్తారు అని తెలిసినా..ఎలా కలుస్తారు అనే విషయం ఆసక్తిగా చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. కథ పాతదైనా.. కొత్తగా చెప్పేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నం సక్సెస్ కాలేదని చెప్పవచ్చు. స్క్రీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. సినిమా మొత్తం స్లోగా నడవడంతో ప్రేక్షకులు బోర్ గా ఫీలవతారు. ప్రధాన పాత్రల్లో శౌర్య, రాశి, అవసరాల పాత్రల మేరకు బాగా నటించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. డైలాగ్ లతో వచ్చే కామెడీ పర్వాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది.

ప్లస్ లు : మేకింగ్, సినిమాటోగ్రఫీ.
మైనస్ లు: కథ, కథనాలు, సంగీతం, స్టో నెరేషన్.
దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ మంచి ప్రయత్నం చేశాడు. కానీ..’ఎక్స్ ప్రెస్’ ల్లాంటి సినిమాలు చూసేందుకు అలవాటైన ప్రేక్షకులు.. గూడ్సు రైలు లాంటి ఈ సినిమాను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.

About the Author