Published On: Sat, Mar 30th, 2013

ఉ.కొరియా సమర సన్నాహాలు!

Share This
Tags

కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దక్షిణ కొరియా గగనతలంపై అణుబాంబు సామర్థ్యం కలి గిన రెండు అత్యాధునిక అమెరికా బి-2 యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టడంతో ఉత్తర కొరియా అప్రమత్తమైంది. దక్షిణ కొరియా, గ్వామ్, హవాయ్‌లతోపాటు పసిఫిక్ సముద్రంలో అమెరికా అధీనంలో ఉన్న ద్వీపాలపై ఏ క్షణంలో అయినా రాకెట్ దాడులు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఉత్తర కొరియా తన సైన్యాన్ని ఆదేశించింది. శుక్రవారం ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సైనిక ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశమై, ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ‘కొరియన్ సెంట్రల్’ వార్తాసంస్థ తెలిపింది.

అమెరికా సామ్రాజ్యవాదులకు తగిన విధంగా బదులివ్వాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా కిమ్ వ్యాఖ్యానించినట్లు వివరించింది. అయితే దక్షిణ కొరియాను బెదిరించేందుకే ఉత్తర కొరియా ఈ సన్నాహాలు చేస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నా రు. ఉత్తర కొరియా నుంచి తమ దేశానికి ముప్పు పెరిగిందని, అయితే ఎలాంటి పరిస్థితినైనా ధీటుగా ఎదుర్కొంటామని అమెరికా రక్షణమంత్రి చక్ హెగెల్ పేర్కొన్నారు. కాగా, ఈ వ్యవహారంలో అన్ని పక్షాలు బలప్రదర్శనకు దిగ రాదని రష్యా శుక్రవారం సూచించింది.

About the Author

-