ఉల్లిపాయలో ఉన్నాయి జుట్టు సమస్యలకు పరిహారాలు…!
ప్రస్తుత రోజుల్లో చాలా మంది జుట్టుకు సంబంధించి చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాడం మొదలకుని చుండ్రు వరకూ చాలా రకాల జుట్ట సమస్యలను నివారించడానికి కూడా వీలుపడనన్ని సమస్యలు ఎదుర్కో వల్సి వస్తోంది. జుట్టు రాలడం మరియు జుట్టు అతి తక్కువగా లేదా నిధానంగా పెరగడం వంటివి మరో హెయిర్ సమస్య. కేశ సంరక్షణ జాగ్రత్తలు తీసుకొన్న తర్వాత కూడా అదే విధంగా ఉంటే దానికి కారణం అనారోగ్యకరమైన జీవన శైలి, ఆహారంలో అసమతుల్యత వల్ల చర్మ మరియు జుట్టు మీద చెడు ప్రభావాన్ని చూపెడుతుంది. ఇటువంటి సమస్యలను అరికట్టడానికి చాలా ట్రీట్మెంట్లు తీసుకొన్నా కూడా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది.
చాలా మంది కేశాలను సంరక్షించుకోవడం కోసం కొన్ని ఇంటి చిట్కాలను సాధారణ పద్దతుల్లో ఉపయోగిస్తుంటారు. మన వంటగదిలోని చాలా రకాలు వంటకు ఉపయోగించే వస్తువులను హెయిర్ కేర్ లో భాగంగా ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు తేనె, గుడ్డు, పెరుగు, బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మరసం, మరియు ఉల్లిపాయ వంటివి హోమ్ రెమెడీ హెయిర్ ట్రీట్మెంట్ కు ఉపయోగిస్తుంటారు. అవును, నిజంగానే ఉల్లిపాయ మన కళ్ళలో నీళ్ళు కారేవింధంగా చేస్తుంది. అలాగే కురుల సమస్యలను కూడా నివారిస్తుంది. మరి ఎలాగో చూద్దామా…
1. జుట్టు రాలడాన్ని అరికడుతుంది: ఉల్లిపాయల వల్ల ఒదొక మంచి ప్రయోజనం. ఉల్లిపాయలో అధిక శాతంలో సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ రక్త ప్రసరణను పెంచి, కురులకు శక్తిని ఇస్తుంది. ఉల్లిపాయను మెత్తగా చేసి తలకు రాయడం వల్ల జుట్టు రాలడాన్ని అరికడుతుంది. దీన్ని అలాగే ఉల్లిపాయ పేస్ట్ తలకు పట్టించడం లేదా ఏదైనా ఇతర హెయిర్ ప్యాక్ లతో ఈ పేస్ట్ ను కూడా కలిపి తలకు పట్టించాలి. ఇలా చేయడానికి అరగంట ముందు తలకు హాట్ ఆయిల్ మసాజ్ చేయాలి.
2. జుట్టు పెరగడానికి : ఇది మరో అద్భుతమైన ప్రయోజనం. ఉల్లిపాయ రసంను తలకు పట్టించడం వల్ల తలలో రక్తప్రసరణ బాగా జరిగి కొత్తగా వెంట్రుకలు మొలవడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ హెయిర్ ఫాల్ ను అరికట్టడమే కాదు, హెయిర్ గ్రోత్ కు కూడా సహాయపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని కొబ్బరి నూనెలో కలుపుకొని బాగా మిక్స్ చేసి తల మాడుకు మసాజ్ చేయాలి. చేసిన అరగంట తర్వాత రెగ్యులర్ గా ఉపయోగించే మంచి షాంపుతో, చల్లనీటి తలస్నానం చేసుకోవాలి.
3. తలలో ఇన్ఫెక్షన్: ఉల్లిపాయ రసం వల్ల తలలో ఇతర ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ మీ కేశాలను డ్యామేజ్ చేయవచ్చు. అంతే కాదు అది జుట్టు రాలడానికి ముఖ్య కారణం కావచ్చు. కాబట్టి స్లాప్ ఇన్ఫెక్షన్ అరికట్టడానికి ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించండి. ఇంకా హెయిర్ ఫాలీసెల్స్ లో మూసుకు పోయిన రంద్రాలను తెరచుకొనేలా చేస్తుంది.
4. చుండ్రు నివారణ: ఉల్లిపాయతో మరో అద్భుతమైన హెయిర్ బెనిఫిట్ ఇది. హోం రెమడీస్ లలో చుండ్రును వదలగొట్టడానికి ఇదొ అద్బుతమైన చిట్కా. ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడం వల్ల హెయిర్ లాస్ అరికడుతుంది. అలాగే చుండ్రును నివారిస్తుంది. మీరు రెగ్యులర్ గా తలకు వాడే హెయిర్ ప్యాక్ కి కొద్దిగా ఉల్లిపాయ రసాన్ని కూడా చేర్చడం వల్ల చుండ్రును నివారించగలుగుతుంది. నిమ్మరసం, పెరుగు, మరియు కొద్దిగా తేనె మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల కూడా చుండ్రును నివారంచవచ్చు.