Published On: Sun, Jul 28th, 2013

ఇప్పుడు డిపాజిట్లే బెటర్!

Share This
Tags

వడ్డీరేట్లు ఇంకా తగ్గుతాయనుకుంటున్న తరుణంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రూపాయి విలువ క్షీణతను అడ్డుకోవటానికి ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలు… తిరిగి వడ్డీరేట్లు పెంచేలా చేస్తున్నాయి. ద్రవ్య సరఫరాను నియంత్రిస్తూ చర్యలు తీసుకోవటంతో బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచక తప్పటం లేదు. నిన్నటిదాకా వడ్డీరేట్లు తగ్గడం ద్వారా పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్ నుంచి లబ్ధి పొందడానికి… లిక్విడ్, షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారి పరిస్థితి అయోమయంగా తయారయ్యింది వడ్డీరేట్లు పెరిగితే బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారి రాబడులు తగ్గిపోతాయి.

ఇప్పటికే పలు లిక్విడ్ ఫండ్లు కొన్ని వారాలుగా నష్టాలను అందించడం ప్రారంభించాయి. ఇప్పుడు అందరి దృష్టీ ఈ నెలాఖరున ఆర్‌బీఐ సమీక్షపైనే పడింది. ఈ సమావేశం తర్వాత వడ్డీరేట్ల కదలికలపై ఒక స్పష్టత రావచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే స్వల్పకాలానికి వడ్డీరేట్లు పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పటికే లిక్విడ్, షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు వైదొలగడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే ఆర్‌బీఐ సమీక్ష వరకు వేచి చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో స్థిరమైన వడ్డీరేటును అందించే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమన్నది నిపుణుల సూచన. వడ్డీరేట్లు పెరిగే అవకాశం ఉండటంతో బ్యాంకు డిపాజిట్లతో పాటు ఎన్‌సీడీలు, కంపెనీల డిపాజిట్లపై కూడా రాబడి పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో దీర్ఘకాలానికి అధిక వడ్డీరేటు ఉన్న ఎన్‌సీడీలు, డిపాజిట్లే బెటర్. రానున్న కొద్ది కాలం డెట్ ఫండ్స్‌లో ఒడిదుడుకులు పెరగవచ్చన్నది నిపుణుల మాట.

About the Author