ఇప్పటికీ ఆయనే అసలైన మన్మధుడు
అక్కినేని నాగార్జున వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు. కానీ ఆయన లేటెస్ట్ లుక్ చూస్తుంటే మాత్రం ఆయనకి నిజంగా 50 సంవత్సరాలు నిండాయా అనిపిస్తుంది. దశరద్ డైరెక్షన్లో నాగార్జున నటిస్తున గ్రీకువీరుడు టీజర్ నిన్న అర్ధ విడుదల చేసారు. ఈ టీజర్లో ఆయన స్టైలిష్ లుక్ చూస్తుంటే మతిపోతుంది. ఈ వయసులో కూడా ఆయన ఇంత స్టైలిష్ గా ఉన్నారంటే హేట్సాఫ్ చెప్పాల్సిందే. కుర్ర హీరోలకి పోటీ ఇస్తూ డ్రెస్సింగ్, హెయిర్ స్టైలింగ్ లాంటి విషయాల్లో వారి కంటే అడ్వాన్సుగా ఉండే నాగార్జున ఈ సినిమాలో కూడా మతిపోగోట్టారు. ఆదర్శ్ అనే నాగార్జున ఫ్యాన్ మాట్లాడుతూ ఆయన వయసు 53 కానీ వయసుతో సంబంధం లేకుండా యువ హీరోల కంటే అందంగా ఉన్నారు అన్నాడు. గ్రీకువీరుడులో నాగార్జున సరసన నయనతార నటిస్తుంది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదల కాబోతుంది.