Published On: Tue, Jun 24th, 2014

‘ఇంద్రుడు’ సినిమా రివ్యూ…

Share This
Tags

తెలుగు హీరోలు కోలీవుడ్ లో పెద్దగా మార్కెట్ ను విస్తరించుకోలేకపోయినప్పటికీ.. తమిళ్ హీరోలు మాత్రం టాలీవుడ్ లో తమ మార్కెట్ ను బాగానే విస్తరించుకున్నారు. వీరిలో ఒకడు విశాల్. ఈ హీరోకి మన ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే విశాల్ సినిమాలు మాత్రం ఈ మధ్య పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఆ మధ్య వచ్చిన ‘ధీరుడు’ కూడా థియేటర్ల నుంచి త్వరగానే వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు మరోసారి ‘ఇంద్రుడు’ అంటూ మన ముందుకు వచ్చాడు. ఇదిలా ఉంటే.. తమిళ్ హీరోలు ఎక్కువగా ప్రయోగాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా హీరోలకు రోగాలు రావడం లాంటి డిఫరెంట్ లైన్ తో బాక్సాఫీస్ వద్ద హిట్లు కొడుతుంటారు. తాజాగా విశాల్ కూడా కొత్త రోగంతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో ‘నాన్ సిగప్పు’ గా తెరకెక్కిన ఈ మూవీ ‘ఇంద్రుడి’గా తెలుగులో విడుదలయ్యింది. మరి డిఫరెంట్ రోగంతో వచ్చిన ‘ఇంద్రుడు’ ఎలా ఉన్నాడో తెలుసుకుందాం..
కథలోకి వెళితే..
ఇంద్ర(విశాల్) అనే కుర్రాడు.. చిన్నప్పటి నుంచి ఎమోషన్స్ ఎక్కువైనా, కోపానికి గురైనా వెంటనే నిద్రలోకి జారుకునే వ్యాధితో బాధపడుతుంటాడు. ఈ వ్యాధిని ‘నార్కోలెప్సీ’ అంటారు. దీని వల్ల అతను ఎవరినీ ప్రేమించలేడు, పెళ్లి కూడా చేసుకోలేడు. ఒంటరిగా తిరగలేదు. ఏ పని సరిగా చేయలేదు. దీంతో అతనికి తెలివితేటలున్నా ఉద్యోగం కూడా రాదు. ఈ సమయంలోనే అనుకోకుండా అతనికి మీరా(లక్ష్మీ మేనన్) అనే ధనవంతురాలైనా ఓ అమ్మాయి పరిచయమవుతుంది. అతనిపై సానుభూతితో దగ్గరై ప్రేమలో పడుతుంది. వారి ప్రేమకు మీరా తండ్రి ఒప్పుకోకపోవడంతో అతనితో గర్భం దాల్చుతుంది. ఆ విషయం తండ్రికి చెప్పాలని వెళుతున్న వీరిపై సడెన్ గా కొందరు దాడి చేస్తారు. హఠాత్తుగా జరిగిన సంఘటనకు ఇంద్ర వెంటనే నిద్రలోకి జారుకుంటాడు. వారంతా కేవలం మీరాపైనే దాడి చేస్తారు. మరి ఈ దాడి చేసింది ఎవరు..? ఎందుకు చేశారు..? వారిపై ఇంద్ర పగ తీర్చుకున్నాడా ..? అసలేం జరిగిందనేది మిగతా కథ.
విశ్లేషణ:..
‘ఇంద్రుడు’ సినిమా అంతా.. విశాల్ ‘వన్ మేన్ షో’గా సాగుతుంది. ఈ పాత్రలో విశాల్ సహజంగా, అద్భుతంగా నటించాడు. కాస్త మెలో డ్రామాను తగ్గించడం వల్ల విశాల్ పాత్రకు సహజత్వం వచ్చింది. కానీ ఎంతసేపూ ఆ వ్యాధి తాలూకు లక్షణాలు ఎలివేట్ చేశారే గానీ, వ్యాధి ఉన్నా ఏదైనా సాధించవచ్చు అనేలా హీరోయిజం ఆపాదించలేకపోయాడు దర్శకుడు తిరు. ఇక మీరాగా లక్ష్మీ మేనన్ కూడా పర్వాలేదనిపించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఫస్టాఫ్ అంతా ఫర్వాలేదనిపించినా, సెకండాఫ్ కాస్త బోర్ కొట్టించింది. సెకండాప్ లో ఉన్న ప్లాష్ బ్యాక్ సినిమాకు మైనస్ గా మారింది. సాధారణంగా విశాల్ సినిమాల్లో ఉండే ఫైట్స్ ఈ చిత్రంలో లేకపోవడం ఆడియెన్స్ ను కాస్త నిరాశకు గురిచేస్తుంది. పాటలు తక్కువగానే ఉన్నా.. ఆకట్టుకోలేకపోయాయి.
ఇక మిగతా ఆర్టిస్టులలో కమెడియన్ జగన్, సుందర్ రాము పర్వాలేదనిపించారు. టెక్నికల్ గా ఎడిటింగ్ బాగానే ఉన్నా ఇంకా ట్రిమ్ చేయాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. పాటలు మైనస్ అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ఫొటోగ్రఫీ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. దర్శకుడు తిరు ఎంచుకున్న కథ బాగానే ఉన్నప్పటికీ స్ర్కీన్ ప్లే స్లోగా ఉండడం, హీరో పాత్రను మరీ తక్కువ చేసి చూపించడం సినిమాకు ఒక మైనస్. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఎంటర్ టైన్ మెంట్ లేకపోవడంతో సినిమా బోర్ కొట్టిస్తుంది.

About the Author