ఆ 25 సూత్రాల అమలు తప్పనిసరి: డీజీపీ
పోలీసుశాఖను పటిష్టపరిచేందుకు రూపొందించిన 25 సూత్రాలను పోలీస్‌స్టేషన్ల వారీగా తప్పనిసరిగా అమలుచేయాలంటూ అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్‌లకు డీజీపీ వి.దినేష్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని పోలీస్ కో-ఆర్డినేషన్ విభాగం అదనపు డీజీ వినయ్‌కుమార్‌సింగ్ మీడియాకు వెల్లడించారు. మూడు నెలల కిందట చేపట్టిన ఈ ప్రక్రియను మరో మూడు నెలల్లో పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేయదగ్గ ప్రతి ఫిర్యాదుపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, ప్రతి సోమవారం పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి ఎస్పీ వరకూ ఫిర్యాదులు స్వీకరించాలని సూచించారు.