Published On: Thu, Feb 28th, 2013

ఆమెను బాహుబలి కోసం తీసుకోలేదన్న రాజమౌళి

Share This
Tags

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేయనున్న సినిమా ‘బాహుబలి’. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు దగ్గుబాటి రానా, అనుష్క ప్రధాన పాత్రలు పొశిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కొన్ని పత్రికల్లో, వెబ్ సైట్స్ లో తాజాగా ఈ చితంలోని మరో ముఖ్య పాత్రకి శృతి హాసన్ ని తీసుకున్నారని ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇవ్వన్నీ పుకార్లే అని రాజమౌళి కొట్టిపారేశారు. ‘ బాహుబలి కోసం శృతి హాసన్ ని తీసుకున్నాం అని వస్తున్న వార్తలు నిజం కాదు. ఆమెని మేము అసలు సంప్రదించలేదని’ రాజమౌళి ట్వీట్ చేశారు.

ప్రస్తుతం లోకేషన్స్ వేటలో రాజమౌళి బిజీగా ఉండగా, మరోవైపు ప్రభాస్, రానా, అనుష్క కత్తి పోరాటాలు, గుర్రపు స్వారీలు నేర్చుకుంటున్నారు. ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా, కె.కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్.

About the Author