ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఫార్మసీ పరీక్షల షెడ్యూల్ విడుదల
వర్సిటీ పరిధిలో నిర్వహించనున్న బీఫార్మసీ పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం సీఈ డి.సత్యనారాయణ విడుదల చేశారు. బీఫార్మసీ మొదటి, మూడో సంవత్సరాంతపు సప్లిమెంటరీ పరీక్షలు మే నెల రెండో తేదీ నుంచి ప్రారంభమవుతాయి. రెండు, నాలుగో సవత్సరాంతపు సప్లిమెంటరీ పరీక్షలు మే నెల 10 తేదీ నుంచి ప్రారంభమవుతాయి. పరీక్ష ఫీజు ఒక్కో సంవత్సరంలో అన్ని సబ్జెక్టులకు 620 రూపాయలు చెల్లించాలి. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 10 ఆఖరు తేదీ. 100 రూపాయల అపరాధ రుసుంతో ఈ నెల 12 వరకు ఫీజు చెల్లించవచ్చు.
ఎనిమిదో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్
వర్సిటీ పరిధిలో నిర్వహించనున్న బీఫార్మసీ ఎనిమిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. పరీక్షలు ఈ నెల 29 తేదీ నుంచి ప్రారంభమవుతాయి. పరీక్ష ఫీజు అన్ని సబ్జెక్టులకు 620 రూపాయలు చెల్లించాలి. ఫీజు చెల్లించేందుకు 10 ఆఖరు తేదీ. 100 రూపాయల అపరాధ రుసుంతో ఈ నెల 12 వరకు ఫీజు చెల్లించవచ్చు.
బీఈడీ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్
వర్సిటీ పరిధిలో ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న బీఈడీ,స్పెషల్ బీఈడీ కోర్సుల సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. ఫీజు చెల్లించేందుకు 12 ఆఖరు తేదీ. 100 రూపాయల అపరాధ రుసుంతో ఈ నెల 15 వరకు ఫీజు చెల్లించవచ్చు. అన్ని పేపర్లకు ఫీజు రూ.530, ఒక్క పేపర్‌కు రూ.190 రెండు పేపర్లకు రూ.250, మూడు పేపర్లకు రూ.330 చెల్లించాలి.