అలిపిరి నుంచి తిరుమల వరకూ సీసీ కెమెరాలు ఏర్పాట్లు :
తిరుమలలో భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ నడుం బిగించింది. అలిపిరి నుంచి తిరుమల వరకూ సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రెండువేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. కాగా భక్తుల సౌకర్యార్థం స్థానిక ఆలయాల్లో కూడా ఆర్జిత సేవా టిక్కెట్ల కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేయనుంది.